Home >> ప్రహేళికలు >> సంస్కృత పదాలు

ప్రహేళిక 2.1

సంకా ఉషారాణీ

అంతా గురువులే- నమో నమః-

1. హిమాలయపర్వతం ఉమకు = --గురుః
2. సతీర్థుడు, ఒకే ఆచార్యుడు కలవాడు = --గురుః
3. ఆచార్యుల వరుస, పారంపర్య ఆదేశం అట = గురు--

ప్రహేళిక 2.2

సంకా ఉషారాణి

‘సా’ అంటే సాంతపదాలోచ్..

ఒక శాస్త్రం = --సా = మీమాంసా

1. ఒక రామాయణనదీ = --సా
2. వేగంగా = --సా
3. ఊపిరి అవయవం = --సా

ప్రహేళిక 2.3

సంకా ఉషారాణి

‘లీ’ తో రాలును సంస్కృత పదాలు-

1. అబద్ధం = -లీ-
2. చిన్న ఏలక్కాయ = -లీ-
3. మంచి వంశానికి చెందిన = -లీ-

ప్రహేళిక 2.4

సంకా ఉషారాణి

వ్రతాలండీ వ్రతాలు- రకరకాల వ్రతాలు.. పేర్లు చెప్పండి, వీరహారాలు పట్టండి..

భాద్రశుక్లచతుర్దశీవ్రతం = అనన్తవ్రతం

1. భాద్రశుక్లచతుర్దశీవ్రతం
2. ఆరోగ్యంకోసం భానుని వ్రతం
3. చాన్ద్రాయణం

ప్రహేళిక 2.5

సంకా ఉషారాణి

ఈ ‘సరు’లెవరో ఎరుగుదురా?

నా జలాశయం కాదు, ఓర్వలేనితనం = --సరః = మత్సరః

1. నా జలాశయం కాదు, ఓర్వలేనితనం = --సరః
2. మందుకు పోవుడు = --సరః
3. నిరవకాశః = ---సరః

ప్రహేళిక 2.6

సంకా ఉషారాణి

ఈ ‘చరు’లెవరో ఎరుగుదురా?

1. ఇంద్రియాలకు కనిపించని(వాడు) = --చరః
2. వెనకతిరిగేవాడు = --చరః
3. విద్యాధరుడు, పక్షి, మేఘం, వాయువు, ఆకాశంలో తిరిగే = --శ్చరః

ప్రహేళిక 2.7

సంకా ఉషారాణి

'అనన్త' తో పదాలివి- వీటి అంతు చూడండి..

1. చివరలేనిది, ఆకాశం (3) = ---
2. చివర లేనివాడు, విష్ణువు (3) = ---
3. చివరలేనివాడిని గెలిచినవాడు, పదునాలుగవ జినుడట (4/6) = =

ప్రహేళిక 2.8

సంకా ఉషారాణి

'గణ' గణమనే ఈ పదాలను పట్టుకురండి-

సమూహభర్త = గణ-- = గణపతిః

1. సమూహభర్త = గణ--
2. దైవజ్ఞుడు, జ్యోతిష్కుడు = గణ-
3. పైనాయన భార్య = గణ-

ప్రహేళిక 2.9

సంకా ఉషారాణి

హహహ ‘హః’-

కాయం = దేహః

1. కాయం = దేహః
2. పాపం, దుఃఖం = -హః
3. యుద్ధంలో సైన్యాకార విన్యాసం = -హః

ప్రహేళిక 2.10

సంకా ఉషారాణి

‘వస’ అంటూ ‘వస’ పోస్తానంటే పదాలు పలుకుతామంటున్నాయి

ఉదా- సంస్కృతనాటకాలలో ప్రసిద్ధరాజవిదూషకుని పేరు = వసన్తకః

1. అక్కరలేని
2. అక్కర ఉన్న, సందర్భం
3. గృహం

ప్రహేళిక 2.11

సంకా ఉషారాణి

ఈ ‘మన్-మా’ లెవరు?

అణపత్వం సూక్ష్మత్వసిద్ధి = --మా = అణిమా

1. అణపత్వం సూక్ష్మత్వసిద్ధి = --మా
2. హ్రస్వత్వసిద్ధి = --మా
3. పెద్దగ పెరగటం = --మా

ప్రహేళిక 2.12

సంకా ఉషారాణీ

సర్వం ‘మధు’మయం-

అన్ని పదాలు మధు--

1. తేనెను చేసేవాడు భ్రమరుడు = మధు_ _
2. తేనెను తాగేవాడు భ్రమరుడు = మధు_, మధు_ _
3. ఇద్దరు రక్కసులు = మధు_ _ _