4. చేతులు జోడించి ఉన్న ఇంద్రాదులచే ఎదురుగా
స: శక్రాదిభిర్ముకులితాఞ్జలిభిః పురస్తాత్
5. వేదాలు ఆగమాలలోని సూక్తాల మంత్రాలతో
స: నిగమాగమ-సూక్తమన్త్రైః
6. ఓ దేవి, ఋగ్వేదం మొదలైనవన్నీ నీ ఆటల పలుకులు
స: లీలావచాంసి తవ దేవి ఋగాదివేదాః
7. చంద్రవంక నగగా వేసుకున్న వాడి సగం ఒంట్లో ఉన్నదానా
స: శశికలాభరణార్ధదేహే
8. మూడు సంధ్యలలో అందరు రాజులచే
స: సన్ధ్యాత్రయే సకల-భూసుర-సేవ్యమానే
9. భార్యలు, పిల్లలు, సేవకులు, అతిథులు అన్నం కోరినవారై ఉన్నారు
స: జాయాః సుతాః పరిజనాతిథయోఽన్నకామాః
10. మంచి (నిజమైన) భక్తులకు కోరినకోరికలిచ్చే లత వంటిదానా
స: సద్భక్తకల్పలతికే
11. భూమిపై ఏకైక నమస్కారయోగ్యురాలా
స: భువనైకవన్ద్యే
12. కరుణతో నిండిన కన్నులు కలదానా
స: కారుణ్యపూర్ణనయనే